సుకుమార్‌ ఫస్ట్‌ సినిమా 'కుమారి 21F' రీరిలీజ్‌ (ట్రైలర్‌) | Kumari 21F Movie Re-Release Trailer Out Now | Sakshi
Sakshi News home page

'కుమారి 21F' బడ్జెట్‌కు మించి లాభాలు.. రీరిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

Jul 8 2025 12:21 PM | Updated on Jul 8 2025 12:29 PM

Kumari 21F Movie Re-Release Trailer Out Now

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి, కథా కథనాలు అందిస్తూ తెరకెక్కించిన సినిమా 'కుమారి 21 ఎఫ్' (Kumari 21F).. 2015లో విడుదలైన ఈ చిత్రం జులై 10న రీరిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు.  రాజ్ తరుణ్- హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కథ చాలా బలంగా పనిచేసింది. ఆపై  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలకంగా మారింది. సుమారు రూ. 10 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 38 కోట్ల వరకు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతగా సుకుమార్‌కు మంచి లాభాలను ఈ చిత్రం తెచ్చిపెట్టింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం జులై 10న మరోసారి థియేటర్‌లో విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement