మాటలకు మించిన థెరపీ ఉండదు

Kubbra Sait Special Interview In Sakshi Funday

కుబ్రా సేఠ్‌ ఈ జన్మనామం కన్నా ‘కుకూ’ అనే పాత్ర పేరుతోనే పాపులర్‌.  కారణం.. ‘సేక్రెడ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌లోని ఆ భూమిక ట్రాన్స్‌జెండర్‌ కావడం.. దాన్ని కుబ్రా అద్భుతంగా పోషించడం. కుబ్రా  స్క్రీన్‌ లైఫ్‌ ఎంత ఆసక్తికరమో ఆమె రియల్‌ లైఫ్‌ అంతే స్ఫూర్తిమంతం.  ‘కుబ్రా’ అంటే అరబిక్‌లో ‘గ్రేట్‌’ అని అర్థం. ఆ సార్థకనామధేయురాలి గురించి...

  • పుట్టిపెరిగింది బెంగళూరులో. తల్లిదండ్రులు... యాస్మిన్‌ సేఠ్‌ మహ్మద్‌ హదీద్‌. రేడియో జాకీ.. దానిష్‌ సేఠ్‌ ఆమె తమ్ముడు. 
  • ఇంట్రావర్ట్‌ టు ఎక్సాట్రావర్ట్‌... కుబ్రా తల్లి సంరక్షణలో పెరిగింది. ఏడవతగరతి వచ్చే వరకు ఎవ్వరితో మాట్లాడకుండా, కలవకుండా తనలో తానుగా ఉండేదట. అమ్మ యాస్మిన్‌ .. కూతురిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే ప్రయత్నం చేసింది. ఫలించి తర్వాతికాలంలో మంచి పబ్లిక్‌ స్పీకర్‌గా మారింది కుబ్రా. తనదైన హాస్యచతురతతో నలుగురునీ నవ్విస్తూ ఉంటుందెప్పుడూ. 
  • ‘మిస్‌ పర్సనాలిటీ.. బీబీఎమ్‌ పూర్తవగానే దుబాయ్‌లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం రావడంతో చేరింది. కాని మొదటి నుంచి ‘వినోదం’ అంటే ఇష్టం ఉన్న కుబ్రా మంచి అవకాశం కోసం ఎదురుచూడసాగింది. ఈలోపు దుబాయ్‌లోనే ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌’ అందాలపోటీలు జరగడంతో అందులో పాల్గొని మిస్‌ పర్సనాలిటీ టైటిల్‌ను గెలుచుకుంది. దాంతో వచ్చిన మోడలింగ్‌ అవకాశాలను అందుకొని మైక్రోసాఫ్ట్‌కు ‘బై’ చెప్పింది.
  • యూట్యూబ్‌ స్టార్‌.. ఆమెలోని మాట చతురత ‘పెప్‌ టాక్స్‌ విత్‌ కుబ్రా సేఠ్‌’ అనే యూట్యూబ్‌ చానెల్‌తో స్టార్‌ను చేసింది. ‘టెడ్‌ఎక్స్‌’ ఆమె పలుకులను వినిపించింది. ‘కొమ్యూన్‌’ కూడా కుబ్రాకు మైక్‌ ఇచ్చింది. 
  • రెడీ.. కుబ్రాను నటిగా పరిచయం చేసిన సినిమా. 
  • సేక్రెడ్‌ గేమ్స్‌.. 2017లో వెబ్‌ సిరీస్‌లో ప్రవేశించినా బ్రేక్‌నిచ్చింది మాత్రం అనురాగ్‌ కశ్యప్, విక్రమ్‌ మోత్వానీలు దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ ‘సేక్రెడ్‌ గేమ్స్‌’. అందులోని ట్రాన్స్‌జెండర్‌ క్లబ్, క్యాబరే డాన్సర్‌ కుకూ పాత్ర ఆమెకు ఇంటింటా అభిమానులను సంపాదించి పెట్టింది. కుబ్రా కన్నా కుకూగానే ఫేమస్‌ చేసింది. 
  • వకాలత్‌  ఫ్రమ్‌ హోమ్‌.. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లోని కుబ్రా లేటెస్ట్‌ సిరీస్‌. ఈ కామెడీ సిరీస్‌లో కుబ్రా లాయర్‌గా నటించి వీక్షకులను కడుపుబ్బ నవ్వించింది. 
  • ప్రయాణాలు, సాహస క్రీడలు అంటే చాలా ఇష్టం కుబ్రాకు. స్కూబా డైవింగ్, బంగీ జంప్‌లో దిట్ట.
  • ‘‘మాటలకు మించిన థెరపీ ఉండదు. అవి మనిషికిచ్చే బలమెంతో నేను రియలైజ్‌ అయ్యేలా చేసి.. నన్ను మంచి మాటకారిగా మార్చి.. నాకో గుర్తింపు వచ్చేలా తీర్చిదిద్దింది మా అమ్మే’’ అంటుంది కుబ్రా సేఠ్‌. 
Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top