Kriti Sanon Expensive Car: రూ. 2కోట్ల ఖరీదైన కారు కొన్న హీరోయిన్

Kriti Sanon New Car: ‘మిమి’ సక్సెస్.. చేతిలో ‘ఆదిపురుష్’ వంటి భారీ ప్రాజెక్ట్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్ కృతీ సనన్ తనకు తానే ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. దీని ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని సమాచారం. ప్రసుత్తం ఈ ఖరీదైన బహుమతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ కొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు కృతీ కార్ల సేకరణకు అదనపు ఆకర్షణగా నిలిచింది.
(చదవండి: ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్)
‘మిమి’ సినిమా విజయంతో కృతీ సనన్ బాలీవుడ్‌లో సక్సెస్‌తో పాటు విమర్శకులు ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇన్నాళ్లు ఆమె పడిన శ్రమకు ‘మిమి’ సినిమాతో ఫలితం లభించింది. ఇక ‘ఆదిపురుష్’ వంటి క్రేజి ప్రాజెక్ట్‌కి సైన్ చేసి బాలీవుడ్ టాప్ హీరోయిన్‌లా జాబితాలో చేరారు కృతీ సనన్.
(చదవండి: గర్భవతిగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోలు.. ఇప్పుడు)
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కృతీ సనన్ 'ఆదిపురుష్', 'బచ్చన్ పాండే,' భేదియా ',' గణపత్ ',' హమ్ దో హమారే దో 'తో పాటు మరికొన్ని పేర్లు ఖరారు చేయని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.