ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్‌ నటి

Adipurush Update: Kriti Sanon Played Sita Role Along With Prabhas - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా  ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావసణుడిగా నటిస్తున్నారు. అయితే ప్రభాస్‌కు జోడీగా సీత పాత్రలో ఎవరు నటించనున్నారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సీత పాత్రలో అనుష్క శర్మ, కీర్తి సురేష్‌ సహా పలువురి పేర్లు వినిపించినా చివరికి  కృతి సనన్‌ను ఫైనలైజ్‌ చేశారు. ఈ విషయాన్నిస్వయంగా హీరో ప్రభాస్‌ వెల్లడించాడు. అంతేకాకుండా లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్‌ యంగ్‌ హీరో సన్నీ సింగ్‌ నటించనున్నారు.  ఈ ఇద్దరిని ఆదిపురుష్‌ టీంలోకి స్వాగతిస్తూ ప్రభాస్‌ ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇక ఆదిపురుష్‌లో ప్రభాస్‌ తల్లిగా సీనియర్‌ నటి హేమ మాలిని నటించనుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ వీటిపై చిత్రయూనిట్‌ ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. పాన్‌ ఇండియా సినిమా కావడంతో పలువురు స్టార్స్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్,  ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  3డి గ్రాఫిక్స్‌లో ఒక విజువల్ వండర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని  రిలీజ్ చేయనున్నారు. 

చదవండి : (ఆదిపురుష్‌ అగ్నిప్రమాదం: కావాలనే చేశారా?)
(బాలీవుడ్ టాప్‌ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top