Kriti Sanon: ‘చబ్బీ సనన్’ ఇప్పుడు 15 కిలోల బరువు తగ్గింది!

Kriti Sanon 15Kg Weight Loss Journey: కొంతమందికి నటనే జీవితం. తమకు దక్కిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు ఎంతటి కష్టమైనా భరిస్తారు. తెర మీద తమకు బదులు ఆ పాత్రే కనిపించేలా తమను తాము తీర్చిదిద్దుకుంటారు. హీరోయిన్ కృతి సనన్ సైతం ఆ కోవకు చెందిన వారే. సరోగసీ ద్వారా బిడ్డను కనేందుకు సిద్ధపడి.. గర్భాన్ని అద్దెకు ఇచ్చిన అవివాహితకు ఎదురైన అనుభవాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ‘మిమీ’. ఇందులో టైటిల్ రోల్ పోషించారు కృతి. గర్భవతిగా సహజంగా కనిపించడం కోసం ఏకంగా 15 కిలోల బరువు పెరిగారు. మిమీ పాత్రకు జీవం పోసి తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
ఇక సినిమా షూటింగ్ అయిపోగానే పెరిగిన బరువును తగ్గించేందుకు నడుం బిగించిన కృతి.. అందులో విజయవంతమయ్యారు. కఠిన వర్కౌట్లు, వ్యాయామాలతో పూర్వ రూపాన్ని తిరిగి దక్కించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన కృతీ సనన్.. ‘‘‘మిమీ’ కోసం 15 కిలోల బరువు పెరగడం ఒక సవాలు. అంతేకాదు ఈ చబ్బీ సనన్ అంత బరువు తగ్గడం కూడా అంతసులభమేమీ కాదు! 3 నెలల పాటు వర్కౌట్ లేదు. కనీసం యోగా కూడా చేయలేదు. నా స్టామీనా జీరో అయిపోయింది! ఇప్పుడు నెమ్మదిగా పూర్వరూపం సంతరించుకుంటోంది’’ అని తన ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని పంచుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా కృతీ సనన్, పంకజ్ త్రిపాఠి ముఖ్యపాత్రల్లో నటించిన మిమీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. కాగా సరోగసీ ద్వారా బిడ్డను కావాలనుకున్న ఓ జంట.. తీరా అద్దె గర్భం ద్వారా బిడ్డ పుట్టే సమయానికి తమకు ఆ బేబీ వద్దు అని చెప్పడం, ఆ క్రమంలో మిమీకి ఎదురైన కష్టాలు, సమాజం నుంచి ఎదురయ్యే ఇబ్బందులు ఇతివృత్తంగా సినిసా సాగుతుంది.
చదవండి: Viral Video: వధూవరులు షాక్; నువ్వు పడినా పర్లేదు.. కానీ