
హీరో నాగచైతన్య, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి, నాగచైతన్యకు వినిపించారట. ఈ కథ నాగచైతన్యకు నచ్చిందని, దీంతో ఈ కథకు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని టాక్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే దర్శకులు బోయ పాటి శ్రీను, శివ నిర్వాణ కూడా నాగచైతన్యకు కథలు వినిపించారనే వార్తలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య ఏ దర్శకుడితో తన కొత్త సినిమాను ముందుగా సెట్స్‌కు తీసుకువెళ్తారనే సస్పెన్స్ వీడాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. ఇక ప్రస్తుతం ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలోని ‘వృషకర్మ’ (వర్కింగ్ టైటిల్) సినిమాతో నాగచైతన్య బిజీగా ఉన్నారు.