చాక్లెట్లు ఆశ చూపి.. లైంగిక వేధింపులు.. హాస్యనటుడు అరెస్టు

Kollywood: Molestation Case Filed Against Comedian Ab Raju On 6 Year Old Girl - Sakshi

చెన్నై: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలతో సినిమా హాస్యనటుడు ఏబీ రాజును పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. చెన్నై వలసరవక్కంకు చెందిన మోహన్‌ సినిమాలో సహాయ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య బుల్లితెరపై నటిస్తున్నారు. వీరికి ఆరేళ్ల కుమార్తె ఉంది. రెండో తరగతి చదువుతోంది. సినిమాలో హాస్యనటుడుగా ఉంటున్న ఏబీ రాజు (49) వెంకటేష్‌ నగర్‌ మొదటి వీధిలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటికి వెళ్లి ఆడుకోవడం చిన్నారికి అలవాటు.

ఈ క్రమంలో గత 14వ తేదీ రాత్రి 8 గంటలకు చిన్నారి ఏబీ రాజు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలికకు చాక్లెట్లు ఇచ్చి అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీని గురించి బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన బాలిక నీరసంగా కనబడటంతో తల్లిదండ్రులు ఆమె వద్ద విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. దీనిపై విరుగంబాక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఏబీ రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

చదవండి: Payal Rajput: ఆ సమయంలో నెర్వస్‌గా ఉంటాను: పాయల్‌ రాజ్‌పుత్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top