వారికి అచ్చిరానీ టాలీవుడ్.. రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' పరిస్థితి ఏంటీ? | Sakshi
Sakshi News home page

Kollywood directors: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్‌'.. మెగా ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్‌ !!

Published Fri, May 19 2023 5:41 PM

Kollywood directors No Successful Movies with Tollywood Heroes - Sakshi

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో భాష హద్దులు దాటేస్తున్నారు. ఏ వుడ్‌ హీరో ఆ వుడ్‌లోనే సినిమా చేయాలనేది ఒకప్పటి మాట. డైరెక్టర్లు కూడా మార్కెట్‌ ఉన్న హీరో అయితే చాలు ఏ వుడ్‌ అయితే ఏంటి అంటున్నారు. పాన్‌ ఇండియా పేరుతో అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ డైరెక్టర్స్‌ మన తెలుగు హీరోల వెనక పడుతున్నారు. మన హీరోలు కూడా మార్కెట్‌ పెంచుకునేందుకు తమిళ డైరెక్టర్లతో జతకడుతున్నారు. కానీ ఒక్కోసారి ఇవి దెబ్బకొడుతున్నాయి. ఈ మధ్య అయితే తమిళ డైరెక్టర్లను నమ్మి చేతులు కాల్చుకుంటున్నారు మన తెలుగు హీరోలు. కోలీవుడ్‌ డైరెక్టర్లను నమ్మి బొక్కబోర్లా పడ్డారు. 

దాంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్‌ మొదలైంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న గేమ్‌ ఛేంజర్‌ పరిస్థితి ఏంటా? అని భయపడుతున్నారు. ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీకి సెన్సేషనల్‌ హిట్‌ ఇచ్చిన శంకర్‌ గ్రాఫ్‌ ఈ మధ్య పడిపోయిందనే చెప్పాలి. అందుకే ఎలాగైనా ఓ భారీ హిట్‌ కొట్టాలని రామ్‌ చరణ్‌ మార్కెట్‌ను వాడుకుంటున్నారు.. ఇక ట్రిపుల్‌ ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌గా మారాడు చరణ్‌. ప్రస్తుతం తెలుగు హీరోల మధ్య గ్లోబల్‌ స్టార్‌ వార్‌ నడుస్తోంది. ఈ క్రమంలో శంకర్‌తో చరణ్‌ మూవీ వర్కవుట్‌ అవుతుందో లేదోనని అనుమానాలు వస్తున్నాయి. దీనికి కారణం రీసెంట్‌గా వచ్చిన బైలింగువల్‌ మూవీ రిజల్ట్సే. తెలుగు హీరో-తమిళ డైరెక్టర్స్‌ కాంబోలో వచ్చిన సినిమాలన్నీ నిరాశ పరిచినవే ఉన్నాయి. 

(ఇది చదవండి: శింబుకి షాక్‌ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట)

పాన్‌ ఇండియా క్రేజ్‌లో పడి మన తెలుగు హీరోలు తమిళ్‌ డైరెక్టర్స్‌కి డేట్స్‌ ఇస్తున్నారు. అలా లింగుస్వామి ది వారియర్‌తో రామ్‌కు డిజాస్టర్‌ ఇచ్చాడు. తాజాగా వెంకట్‌ ప్రభు కస్టడీతో నాగచైతన్యకు ఫ్లాప్‌ను ఖాతాలో వేశాడు. కస్టడీకి తమిళంలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కానీ తెలుగులోనే మెప్పించలేకపోయింది. ఇదంతా చూస్తుంటే తమిళ డైరెక్టర్స్‌ మన తెలుగు ఆడియన్స్‌ పల్స్‌ పట్టలేకపోతున్నారనిపిస్తోంది. తెలుగు నేటివిటికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ రాయలేకపోతున్నారేమోనన్న చర్చ నడుస్తోంది. ఖుషితో ఇండస్ట్రీకి మంచి హిట్‌ ఇచ్చిన ఎస్‌జే సూర్య కూడా కొమరం పులి, నానితో మన సూపర్‌స్టార్స్‌కు డిజాస్టర్‌ ఇచ్చాడు. 

కోలీవుడ్‌లో తుపాకి, కత్తి, గజిని లాంటి మూవీస్‌తో భారీ హిట్స్‌ ఇచ్చాడు ఏఆర్‌ మురుగదాస్‌. కానీ తెలుగు హీరోలతో స్టాలిన్‌, స్పైడర్‌ చేసి హిట్‌ కొట్టలేకపోయాడు. ముఖ్యంగా స్పైడర్‌ సినిమాతో సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ని భయపెట్టినంత పని చేశాడు. అలాగే రీసెంట్‌గా వచ్చిన ది వారియర్‌, కస్టడీలు తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తమిళ డైరెక్టర్స్‌ తెలుగు ఇండస్ట్రీకి అచ్చిరావడం లేదా! అనే వాదనలు వస్తున్నాయి. అదే సెంటిమెంట్‌ ఉన్నట్టయితే శంకర్‌-చరణ్‌ కాంబినేషన్‌ ఏమవుతుందోనని మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్‌ పట్టుకుంది. మరి అందరి డైరెక్టర్స్‌ లాగే శంకర్‌ కూడా షాకిస్తాడా? లేక ఫేట్‌ మార్చి హిస్టరీ క్రియేట్‌ చేస్తాడా? చూడాలి. కానీ గేమ్‌ ఛేంజర్‌ పోస్టర్స్‌, లుక్‌, హైప్‌ చూస్తుంటే చరణ్‌కు మరో పాన్‌ ఇండియా హిట్‌ ఖాయమనే అనిపిస్తుందంటున్నారు.

(ఇది చదవండి: బాలీవుడ్‌ హీరో ఇం‍ట్లో తీవ్ర విషాదం..!)

Advertisement

తప్పక చదవండి

Advertisement