STR 48: Deepika Padukone Demands This Whopping Remuneration For Simbu Film - Sakshi
Sakshi News home page

Deepika Padukone: శింబుకి షాక్‌ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట

May 18 2023 8:40 AM | Updated on May 18 2023 10:31 AM

Deepika Padukone Demands This Whopping Remuneration For Simbu Film - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో దీపికా పదుకొణె ఒకరు. ఈమె ఇటీవల షారూఖ్‌ఖాన్‌తో జత కట్టిన పఠాన్‌ చిత్రంలో మోతాదుకు మించిన అందాలను ఆరబోసి కుర్రకారు మతులను పోగొట్టింది. ఈ సంచలన నటి ఇంతకుముందు కోలీవుడ్‌లో రజనీకాంత్‌కు జంటగా కోచ్చడయాన్‌ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు శింబుకు జంటగా నటింపజేసే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. శింబు నటించిన తాజా చిత్రం పత్తుతల ఇటీవల తెరపైకి వచ్చి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా ఆయన తన 48వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.

విశేషం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు కమలహసన్‌ తన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్‌నేషనల్‌ పతాకంపై నిర్మించనున్నారు. దీనికి కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్‌లైయడిత్తాల్‌ చిత్రం ఫేమ్‌ దేసింగ్‌ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. దీన్ని పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇందులో కథానాయకిగా దీపికా పదుకొణెను ఎంపిక చేయాలని భావించినట్లు ప్రచారం జరిగింది.

 అందులో భాగంగా శింబు చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా కథ నచ్చిందని, తాను నటించడానికి సిద్ధం అని చెప్పిందట. అయితే తన పారితోషికం మాత్రం రూ.30 కోట్లు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అంతే కాకుండా తాను షూటింగ్‌కు వస్తే ఫైవ్‌స్టార్‌ హోటల్లో బసచేస్తానని, ఆ హోటల్లో తాను బస చేసే అంతస్తు మొత్తం తనకే కేటాయించాలని కండిషన్‌ పెట్టి చిత్ర యూనిట్‌కు షాక్‌ ఇచ్చినట్లు సమాచారం.

దీపికా పదుకొణె డిమాండ్‌ చేసిన పారితోషికం నయనతార పారితోషికం కంటే 3 రెట్లు ఎక్కువ కావడంతో ఇప్పుడు మరో హీరోయిన్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో శింబు చిత్ర వర్గాలు ఉన్నట్లు టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అయితే ఇందులో నిజమెంత తెలియాల్సి ఉందన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement