ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతా: కిరణ్‌ అబ్బవరం | Kiran Abbavaram Talks About KA Movie | Sakshi
Sakshi News home page

ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతా: కిరణ్‌ అబ్బవరం

Jul 16 2024 10:42 AM | Updated on Jul 16 2024 11:01 AM

Kiran Abbavaram Talks About KA Movie

‘‘ఇండస్ట్రీలో నా పని అయి΄ోయిందంటూ ఎవరైనా అంటే నమ్మకండి. నా పని అయి΄ోయిందనిపించినప్పుడు నేనే సినిమాలు చేయను. నన్ను ప్రేమించిన అభిమానుల కోసం ఒళ్లు దగ్గర పెట్టుకుని కష్టపడతాను’’ అని హీరో కిరణ్‌ అబ్బవరం అన్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘క’. కిరణ్‌ అబ్బవరం హీరోగా, నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్‌కానుంది. 

కాగా సోమవారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం పుట్టినరోజు. ఈ సందర్భంగా జరిగిన ‘క’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కిరణ్‌ మాట్లాడుతూ– ‘‘క’ చూశాక తెలుగు నుంచి వచ్చిన ఒక మంచి సినిమా అని ప్రేక్షకులంతా చెప్పుకుంటారు’’ అన్నారు. ‘‘క’ మూవీతో నా కల నెరవేరుతోంది’’ అన్నారు చింతా గోపాలకృష్ణా రెడ్డి.

 ‘‘మాలాంటి కొత్త డైరెక్టర్స్‌కు ‘క’ లాంటి టీమ్‌ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అన్నారు సుజీత్‌. ‘‘క’ అంటే కిరణ్‌ అబ్బవరం అని అనుకుంటున్నారు. కానీ ‘క’ అంటే సినిమాలో ఒక ఇం΄ార్టెంట్‌ రోల్‌ ఉంటుంది’’ అన్నారు సందీప్‌. ఈ వేడుకలో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సతీష్‌ వేగేశ్న, చిత్ర సహ నిర్మాత వినీషా రెడ్డితో పాటు చిత్రయూనిట్‌ సభ్యులు మాట్లాడారు. 

Advertisement
 
Advertisement
Advertisement