
విజయ్ దేవరకొండ హిట్ పడి చాలా కాలమైంది. దీంతో తన లేటెస్ట్ సినిమా 'కింగ్డమ్'పై బోలెడు ఆశలు పెట్టేసుకున్నాడు. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. కానీ ఒకటి రెండు రోజులు ఆగితే అసలు రిజల్ట్ ఏంటనేది బయటపడుతుంది. సరే ఇదంతా పక్కనబెడితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్ ఏంటి? ఎప్పుడు రావొచ్చు?
ఒకప్పటితో పోలిస్తే థియేటర్లకు జనాలు బాగానే వెళ్తున్నారు. ఆగస్టు 14 వరకు మరో పెద్ద మూవీ లేదు కాబట్టి.. 'కింగ్డమ్'కి మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. కానీ ఏ మేరకు దాన్ని క్యాష్ చేసుకుంటుందనేది చూడాలి. అలానే కలెక్షన్ కూడా రాబట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నిర్మాణ సంస్థ ఎప్పుడో నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించింది. మరి ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రావొచ్చు?
(కింగ్డమ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రీసెంట్ టైంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీసే సినిమాల్ని దాదాపుగా నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. 'కింగ్డమ్' కూడా అలానే దక్కించుకుంది. అలానే ఈ చిత్రాలన్ని చాలావరకు నాలుగు వారాల గ్యాప్‌తోనే ఓటీటీల్లోకి వస్తున్నాయి. ఈ మూవీ కూడా అలానే రావొచ్చని తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో లేదంటే సెప్టెంబరు తొలివారంలో 'కింగ్డమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్నప్పుడు దూరమైన అన్న శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీస్ అధికారులతో సూరికి గొడవ అవుతుంది. ఈ విచారణ సాగుతున్న సమయంలోనే సూరి.. ఓ అండర్ కవర్ మిషన్ బాధ్యతల్ని భుజాన వేసుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని ఓ శివ ఉన్నాడని, అక్కడికి గూఢచారిగా వెళ్లాలనే పని సూరికి అప్పజెబుతారు. మరి ఆ ద్వీపంలో ఉన్న తెగకు, శివకీ సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ‘కింగ్డమ్’పై రష్మిక రివ్యూ.. ఒకే మాటతో తేల్చేసిందిగా!)