విడాకులు తీసుకోబోతున్న స్టార్‌ కపుల్‌

Kim Kardashian Preparing to Divorce Kanye West - Sakshi

ఏడేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికేందుకు సిద్ధం అవుతున్నారు

హాలీవుడ్‌లో ప్రముఖ దంపతులు కిమ్ కర్దాషియాన్, కేన్‌ వెస్ట్ విడిపోతున్నారనే ఊహాగానాలు గత కొద్దికాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరేలా వారిద్దరు విడాకులు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇక ఇప్పటికే గత కొద్దికాలంగా వీరిద్దరి వేరువేరుగా ఉంటున్నట్టు సమాచారం. కిమ్ కర్దాషియాన్ తన నలుగురు పిల్లల్ని తీసుకొని లాస్ ఎంజెలెస్‌లోని తన నివాసంలో ఒం‍టరిగా ఉంటున్నారు. కేన్‌ వెస్ట్ ప్రస్తుతం వోమింగ్‌లో ఒంటరిగా ఉంటున్నారు. వారి మధ్య విభేదాలు పరిష్కరించుకొలేని స్థాయికి వెళ్లడంతో వారిద్దరి విడిపోవడానికి సిద్ధమవుతున్నారు అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కిమ్‌, కేన్‌ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్లు కలిసి ఉన్న వీరు త్వరలో విడిపోనున్నారు. (చదవండి: విడాకులు కోరిన ఐఏఎస్‌ దంపతులు)

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం నాటి నుంచే వారి దాంపత్య జీవితంలో కలహాలు చోటు చేసుకొన్నాయని సమాచారం. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా కలుసుకొంటున్నారు. కిమ్ తల్లిపై కేన్‌ తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. గత మూడు నెలల క్రితం వారిద్దరు కలిసి మీడియాకు కనిపించిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకు వారిద్దరు కలవలేదని సమాచారం. ఇక తన జీవితం గురించి కీలక నిర్ణయం తీసుకోవడానికి కేన్‌ వెస్ట్ చాలా సమయం వెచ్చిస్తున్నారు. వోమింగ్‌లో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ గురించి ఆలోచిస్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా కిమ్‌ స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ.. ఈ బంధంతో ఆమె చాలా విసిగిపోయింది. ఇక దీన్ని ముగించాలని.. కొంత స్పేస్‌ తీసుకోవాలని భావిస్తుంది అని తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top