‘‘తెలుగు సినిమా కొత్తదారిలో వెళుతున్న ఈ సమయంలో మేం చేసిన ‘కిల్లర్’ మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు దర్శక–నిర్మాత–నటుడు పూర్వజ్. జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ నటించిన సినిమా ‘కిల్లర్’. పూర్వజ్ దర్శకత్వంలో ఉర్వీశ్ పూర్వజ్ సమర్పణలో పూర్వజ్, పద్మనాభ రెడ్డి. ఎ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
ఈ సినిమాలోని ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో పూర్వజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై... ఇలా ఐదు డిఫరెంట్ రోల్స్‌లో నటించారు జ్యోతి. ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీని ఆడియన్స్ థియేటర్స్‌లోనే చూడాలి’’ అని చెప్పారు. ‘‘డాక్టర్ కావాలనుకుని ఐటీ కంపెనీలో పని చేశాను. ఆ తర్వాత సీరియల్స్‌లో పాపులరై, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. ‘కిల్లర్’ కొత్త తరహా కంటెంట్’’ అన్నారు జ్యోతి పూర్వజ్. ‘‘కిల్లర్’లోని విజువల్స్, సాంగ్, ఔట్‌పుట్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాం’’ అని చెప్పారు పద్మనాభరెడ్డి.


