Kiara Advani Is Pregnant, Her Latest Pic With Fans Guessing - Sakshi
Sakshi News home page

Kiara Advani: ఫోటో షేర్ చేసిన హీరో.. గేమ్ ఛేంజర్ హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్!

Jun 25 2023 2:56 PM | Updated on Jun 25 2023 3:27 PM

Kiara Advani Is Pregnant Her Latest Pic With Fans Guessing - Sakshi

బాలీవుడ్ భామ కియారా అద్వానీ బీ టౌన్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌తో గేమ్ ఛేంజర్‌లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లోనూ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. మరోసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో జతకట్టింది. ఇప్పటికే భూల్‌ భూలయ్యా-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జంట మరోసారి 'సత్యప్రేమ్ కి కథ' చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. 

(ఇది చదవండి: ఆదిపురుష్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్‌ చేశాడంటే.. )

తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కియారా, కార్తీక్. ప్రమోషన్లలో భాగంగా రాజస్థాన్‌లో జైపూర్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించి కియారాతో ఉన్న ఫోటోలను కార్తీక్ తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కియారా అద్వానీ మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఆమె ఆ ఫోటోల్లో బేబీ బంప్‌తో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.

కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభవార్త ఉందా? కియారా జీ.. అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లాడిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో అనిల్ అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ సహా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. కియారా, సిద్ధార్థ్  'షెర్షా' మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఆ తర్వాత వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే జపాన్ వేకేషన్‌ నుంచి తిరిగొచ్చిన ఈ బాలీవుడ్ జంట సినిమాలతో బిజీగా ఉన్నారు. 

(ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్‌ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

Advertisement
 
Advertisement
Advertisement