22 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ కాబోతున్న దేశ భక్తి సినిమా | Khadgam Movie Ready To Re-Release, Here's Details | Sakshi
Sakshi News home page

22 ఏళ్ల తర్వాత రీరిలీజ్‌ కాబోతున్న దేశ భక్తి సినిమా

Oct 5 2024 5:14 PM | Updated on Oct 5 2024 5:36 PM

Khadgam Movie Ready To Re-Release, Here's Details

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్‌, ప్రకాశ్‌ రాజ్‌, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయబోతుంది. అక్టోబర్‌ 18న ఈ చిత్రం రీరిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్‌ మీట్‌ పెట్టి షూటింగ్‌ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. 

దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు.  ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement