కేరళలో 'అల్లు అర్జున్‌'ను స్టార్‌గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా? | Do You Know How Khader Hassan Made Allu Arjun A Star In Kerala, Interesting Story Inside In Telugu | Sakshi
Sakshi News home page

కేరళలో 'అల్లు అర్జున్' విజయం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి గురించి తెలుసా?

May 17 2025 9:55 AM | Updated on May 17 2025 11:47 AM

Khader Hassan Made Allu Arjun A Star In Kerala

అల్లు అర్జున్‌కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత  అల్లు అర్జున్‌కు మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్‌ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్‌లో  ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి.  పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్‌డమ్‌ క్రియేట్‌ చేశాడు అ‍ల్లు అర్జున్‌. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.

అల్లు అర్జున్‌ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్‌కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో  'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్‌ వర్షన్‌ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్‌ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్‌ను కలిసి డబ్బింగ​ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను.  అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్‌ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.

'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్‌ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్‌ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి.  'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్‌ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్‌ వెళ్లి దిల్‌రాజును కలిశాను. ఆర్య డబ్బింగ​ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్‌ లేదు. డబ్బింగ్‌ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్‌ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్‌ను కనీసం కలవలేదు' అని అన్నారు.

ఆర్య విజయం కోసం..
ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్‌లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్‌ అయ్యాం. లోకల్‌ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్‌లను సంప్రదించాం. అల్లు అర్జున్‌ స్టిక్కర్స్‌ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్‌లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్‌ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.

ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్‌
ఆర్య  విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్‌ హసన్‌ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్‌ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత  కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. 

అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు.  'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్‌ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం,  అవగాహన వల్లే బన్నీతో  వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్‌ చూస్తాడు' అని ఖాదర్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement