అజిత్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా! | Keerthy Suresh To Pair With Ajith Kumar? Actress Comments Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

అజిత్‌తో కలిసి కచ్చితంగా నటిస్తా!

Aug 6 2024 12:08 PM | Updated on Aug 6 2024 1:26 PM

Keerthy Suresh to Pair with Ajith Kumar?

అవకాశాలు వచ్చినా, విజయాలు అంత సులభంగా రావు. అందుకు కృషి, శ్రమ అవసరం, అదృష్టం చాలా ముఖ్యం. అలా సినీ కుంటుంబం నుంచి వచ్చిన నటి కీర్తీసురేశ్‌. తల్లి నటి, తండ్రి నిర్మాత కావడంతో ఈమెకు అవకాశాలు సులభంగానే వచ్చి ఉండవచ్చు. అయితే స్టార్‌ నటిగా రాణించడానికి ఆమె ప్రతిభనే ముఖ్య కారణం. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న కీర్తీసురేశ్‌ తాజాగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తొలి రోజుల్లో వచ్చిన అవకాశాలను సది్వనియోగం చేసుకున్నా, ఇప్పుడు కథలు నచ్చితేనే నటించడానికి సమ్మతిస్తున్నారు. 

తెలుగు చిత్రం మహానటిలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న ఈమెకు ఆ తరువాత పలు ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథా పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా తాజాగా కీర్తీసురేశ్‌ నటించిన చిత్రం రఘుతాత. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్త హోంబలే నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే చాలా ఆసక్తి నెలకొంది. కారణం ఇదిబలవంతపు హిందీ భాషను వ్యతిరేకించే కథాంశంతో తెరకెక్కడమే. చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న కీర్తీసురేశ్‌ ఒక భేటీలో నటుడు అజిత్‌తో కలిసి నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. 

ఈమె తమిళంలో నటుడు విజయ్, విశాల్, ధనుష్ శివకార్తికేయన్, చివరికి రజనీకాంత్‌కు చెల్లెలిగా కూడా నటించారు. కానీ అజిత్‌తో కలిసి నటించలేదు. ఇదే విషయాన్ని ఆమె పేర్కొంటూ ఈ మధ్య హైదరాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు అజిత్‌ కూడా అక్కడ జరుగుతున్న చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారని, ఆ సమయంలో తాను ఆయన్ని కలిసి పరిచయం చేసుకున్నానని చెప్పారు. అప్పుడు తన తల్లి, శాలిని కలిసి చాలా చిత్రాల్లో నటించారని ఆయనతో చెప్పానన్నారు. తాను కూడా కచ్చితంగా అజిత్‌తో కలిసి నటిస్తాననే నమ్మకాన్ని నటి కీర్తీసురేశ్‌ వ్యక్తం చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement