Keerthy Suresh Bollywood Entry With Varun Dhawan Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ఇన్నాళ్లకు బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైన హీరోయిన్‌

Jul 19 2023 10:12 AM | Updated on Jul 19 2023 11:26 AM

Keerthy Suresh Bollywood Entry with Varun Dhawan Movie - Sakshi

నిజానికి కీర్తీ సురేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది! అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన ‘మైదాన్‌’కు తొలుత హీరోయిన్‌గా ఆమెనే తీసుకున్నారు. కానీ కొన్ని కారణాలవ

హీరోయిన్‌ కీర్తీ సురేశ్‌కు బాలీవుడ్‌ నుంచి కబురు అందినట్లు తెలుస్తోంది. వరుణ్‌ ధావన్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు కాలిస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రంలోని హీరోయిన్‌ పాత్రకు చిత్ర యూనిట్‌ కీర్తీ సురేశ్‌ను సంప్రదించినట్లు బాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది.

ఒకవేళ ఈ వార్త నిజమైతే కీర్తీకి బాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం అవుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. నిజానికి కీర్తీ సురేశ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది! అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించిన ‘మైదాన్‌’కు తొలుత హీరోయిన్‌గా ఆమెనే తీసుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ‘మైదాన్‌’ చిత్రం నుంచి కీర్తి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ పాత్రను ప్రియమణి చేశారు. ఇలా కీర్తీ సురేష్‌ బాలీవుడ్‌ ఎంట్రీ వాయిదా పడింది. ఇక ‘మైదాన్‌’ చిత్రం ఇంకా రిలీజ్‌ కాని సంగతి తెలిసిందే!

ఇదిలా ఉంటే ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫీమేల్‌ సెంట్రిక్‌ చిత్రాలకు పచ్చజెండా ఊపుతోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌ చేస్తోంది. సుమన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రఘు తాత’ చిత్రంతో హోంబలే ఫిలింస్‌ (కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2, కాంతార) తమిళంలో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో విప్లవ భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి కనిపించనుంది. కె. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ‘రివాల్వర్‌ రీటా’ కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

చదవండి: చరణ్‌ కూతురు క్లీంకారకు ఎన్టీఆర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement