‘తంగలాన్‌’ వసూళ్లను చూసి ఆశ్చర్యపోయా: నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా | KE Gnanavel Raja Talks About Thangalaan Movie | Sakshi
Sakshi News home page

‘తంగలాన్‌’ వసూళ్లను చూసి ఆశ్చర్యపోయా: నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా

Aug 17 2024 10:57 AM | Updated on Aug 17 2024 11:08 AM

KE Gnanavel Raja Talks About Thangalaan Movie

‘‘తంగలాన్‌’ సినిమాకు తెలుగులో మంచి ఓపెనింగ్స్‌ వస్తున్నాయి. మేము అనుకున్నదానికంటే రెట్టింపు వసూళ్లు వస్తుండటంతో ఆశ్చర్యపోతున్నాం. విక్రమ్‌గారి కెరీర్‌లో ‘తంగలాన్‌’ చిత్రానివే హయ్యెస్ట్‌ ఓపెనింగ్స్‌’’ అని నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా అన్నారు. విక్రమ్‌ హీరోగా పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తంగలాన్‌’. కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్‌ అయింది. 

ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ రిలీజ్‌ చేసింది. ఈ సందర్భంగా కేఈ జ్ఞానవేల్‌ రాజా మీడియాతో మాట్లాడుతూ– ‘‘నేనెప్పుడూ డైరెక్టర్‌నే నమ్ముతాను. పా. రంజిత్‌గారిపై నమ్మకంతో ‘తంగలాన్‌’ విషయంలో స్వేచ్ఛ ఇచ్చాం. సినిమాల మేకింగ్‌ విషయంలో నా నమ్మకం ఏంటంటే ప్రేక్షకుల అభిరుచిని విశ్వసించడమే. హిందీతో పాటు మిగతా అన్ని భాషల్లోనూ ఈ నెల 30న ‘తంగలాన్‌’ని రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement