ఓటీటీకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌! | kaykaymenon latest Crime Thriller Streaming On This Ott from this Date | Sakshi
Sakshi News home page

Crime Thriller: ఓటీటీకి ఇంట్రెస్టింగ్‌ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్‌!

Aug 20 2024 3:36 PM | Updated on Aug 20 2024 3:52 PM

kaykaymenon latest Crime Thriller Streaming On This Ott from this Date

ఓటీటీల్లో మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ జానర్‌ సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటున్నాయి. అందువల్లే క్రైమ్ జానర్‌లో ఎక్కువగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నారు. తాజాగా మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

విలక్షణ నటుడు కెకె మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌ ముర్షిద్. ఈ సిరీస్‌లో ఆయన గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈనెల 30 నుంచే జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. కాగా.. కెకె మీనన్ ఈ మధ్యే శేఖర్ హోమ్ అనే మరో సిరీస్‌లోనూ కనిపించారు. అంతేకాకుండా ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో తనూజ్ వీర్వానీ, వేదికా భండారీ, అనంగ్ దేశాయ్, జాకిర్ హుస్సేన్ కీలక పాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement