అలాంటి డ్రెస్‌లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్! | Katrina Kaif Seen In Loose Denim Jacket Netizens Says She Is Pregnant, Pic Goes Viral | Sakshi
Sakshi News home page

Katrina Kaif: అలాంటి డ్రెస్‌లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్‌ అంటూ కామెంట్స్!

Jun 25 2024 12:23 PM | Updated on Jun 25 2024 3:20 PM

Katrina Kaif seen in oose denim jacket Netizenz Says she is pregnant

బాలీవుడ్‌ భామ కత్రినా కైఫ్‌ బీటౌన్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్‌ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్‌పోర్ట్‌లో  కనిపించింది.

అయతే కత్రినా కైఫ్‌ వదులుగా ఉండే జాకెట్‌ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్‌ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో లండన్‌ వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.

కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement