తన శరీరాకృతిపై బాడీ షేమింగ్.. స్పందించిన హీరోయిన్ | Katrina Kaif Reacts Trolling Her Body Latest | Sakshi
Sakshi News home page

Katrina Kaif: ట్రోల్స్‌పై స్పందించిన కత్రినా.. అసలేం జరిగిందంటే?

Oct 9 2026 1:17 PM | Updated on Oct 9 2026 1:20 PM

Katrina Kaif Reacts Trolling Her Body Latest

స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. హీరో విక్కీ కౌశల్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు దాదాపుగా పక్కనబెట్టేసింది. గతేడాది నవంబరులో ఓ మగబిడ్డని కన్న తర్వాత బయట కనిపించలేదు. అయితే గత నెలలో అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొనగా.. ఈమె శరీరాకృతిపై దారుణమైన విమర్శలు, ట్రోల్స్ వచ్చాయి. ఇదంతా జరిగి చాలా రోజులైపోయింది. తాజాగా లండన్‌లో ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఈమె.. తనపై జరిగిన బాడీ షేమింగ్ గురించి స్పందించింది.

'ఇతరుల కామెంట్స్‌కు అతిగా ప్రాధాన్యమిస్తే మన నిర్ణయాలు, జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి స్పందిస్తూ పోతే మన లక్ష్యాలపై దృష్టి తగ్గుతుంది. ఇతరుల మాటల ప్రభావానికి లోనవకుండా, మన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలి. కొన్ని సమయాల్లో అందరూ మిమ్మల్ని అభినందిస్తారు. మరికొన్ని సమయాల్లో మీకు మీరే అతిపెద్ద ప్రోత్సాహకులుగా ఉండాలి' అని కత్రినా కైఫ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

తన బ్యూటీ బ్రాండ్‌ ట్యాగ్‌లైన్‌ వెనకున్న ఆలోచనని వివరించిన కత్రినా.. మనల్ని మనం అంగీకరించుకోవాలి. ప్రస్తుతం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం ప్రేమించుకోవాలి. జీవితంలోని పలు దశల్లో మనలో మార్పులొస్తుంటాయి. కొన్నిసార్లు అన్ని విషయాల్లోనూ విజయం సాధిస్తున్నట్లు.. మరికొన్ని సందర్భాల్లో ఏదీ సరిగ్గా చేయలేకపోతున్నామనే అనిపిస్తుంది. మరికొన్నిసార్లు మన రూపం, మనసు రెండూ చాలా బాగున్నట్లు అనిపిస్తాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఆ స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాం. జీవితాన్ని తేలికగా తీసుకోవాలి. ప్రతి విషయాన్నీ మరీ సీరియస్‌గా తీసుకోకూడదు' అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement