నా పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది: నటుడు | Kasautii Zindagii Kay Actor Sahil Anand Quits Social Media | Sakshi
Sakshi News home page

Sahil Anand: నా పరిస్థితి ఘోరం.. అందుకే ఈ నిర్ణయం!

Jul 19 2021 7:05 PM | Updated on Jul 19 2021 8:16 PM

Kasautii Zindagii Kay Actor Sahil Anand Quits Social Media - Sakshi

కొన్ని నెలలుగా నా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా, అందరితో విడదీసినట్లుగా చిత్రవిచిత్రంగా అనిపిస్తోంది. నేను మళ్లీ మామూలు మనిషిని..

Sahil Anand: బుల్లితెర నటుడు సాహిల్‌ ఆనంద్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలం వరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు నెట్టింట్లో ఓ పోస్ట్‌ పెట్టాడు. 'అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. కొంతకాలం వరకు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని డిసైడయ్యాను. కొన్ని నెలలుగా నా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా, అందరితో విడదీసినట్లుగా చిత్రవిచిత్రంగా అనిపిస్తోంది. నేను మళ్లీ మామూలు మనిషిని కావాలంటే కొంత సమయం పడుతుంది.

కొన్నిసార్లు మనం ప్యాషన్‌ అనుకున్నదే మనల్ని వెంటాడే పీడకలగా మారుతుంది. అది మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ మీరందరూ మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నేను సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నించిన ప్రతిసారి నా పరిస్థితి అంతకంతకూ దిగజారుతూనే ఉంది' అని అ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా సాహిల్‌ ఈ మధ్యే తండ్రయ్యాడు. సాహిల్‌ దంపతులకు ఏప్రిల్‌ 14న ఓ కొడుకు జన్మించగా అతడికి సారజ్‌ ఆనంద్‌ అని నామకరణం చేశారు.

ఇతడు 2006లో 'ఎమ్‌టీవీ రోడీస్‌' షో ద్వారా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు టీవీ షోల్లో మెరిసిన సాహిల్‌ 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగు పెట్టాడు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2' లోనూ ఓ ముఖ్య పాత్రలో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement