breaking news
Sahil Anand
-
నా పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది: నటుడు
Sahil Anand: బుల్లితెర నటుడు సాహిల్ ఆనంద్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. కొంతకాలం వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు నెట్టింట్లో ఓ పోస్ట్ పెట్టాడు. 'అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. కొంతకాలం వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని డిసైడయ్యాను. కొన్ని నెలలుగా నా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా, అందరితో విడదీసినట్లుగా చిత్రవిచిత్రంగా అనిపిస్తోంది. నేను మళ్లీ మామూలు మనిషిని కావాలంటే కొంత సమయం పడుతుంది. కొన్నిసార్లు మనం ప్యాషన్ అనుకున్నదే మనల్ని వెంటాడే పీడకలగా మారుతుంది. అది మనల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కానీ మీరందరూ మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నేను సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నించిన ప్రతిసారి నా పరిస్థితి అంతకంతకూ దిగజారుతూనే ఉంది' అని అ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కాగా సాహిల్ ఈ మధ్యే తండ్రయ్యాడు. సాహిల్ దంపతులకు ఏప్రిల్ 14న ఓ కొడుకు జన్మించగా అతడికి సారజ్ ఆనంద్ అని నామకరణం చేశారు. View this post on Instagram A post shared by Sahil Anand (@sahilanandofficial) ఇతడు 2006లో 'ఎమ్‌టీవీ రోడీస్' షో ద్వారా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు టీవీ షోల్లో మెరిసిన సాహిల్ 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో బాలీవుడ్లో అడుగు పెట్టాడు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2' లోనూ ఓ ముఖ్య పాత్రలో నటించాడు. -
దర్జాగా వెళ్లిన తండ్రికొడుకులు ఏం చేశారంటే..
న్యూఢిల్లీ: కార్ల అమ్మకం సంగతి దేవుడెరుగు.. టెస్ట్ డ్రైవింగ్‌లు అమ్మకందార్లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. టెస్ట్ డ్రైవింగ్ కోసం అంటూ కార్లు తీసుకెళ్లిన వారు అటే ఉడాయిస్తున్నారు. తాజాగా ఢిల్లీలో డ్రైవింగ్ టెస్ట్ చేస్తామంటూ ఇద్దరు తండ్రికొడుకులు మెర్సిడీస్ బెంజ్ కారును ఎత్తుకెళ్లారు. చివరకు నానా తంటాలు పడి పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ కార్ల షోరూంకు అనిల్ ఆనంద్(54), సాహిల్ ఆనంద్(23) అనే ఇద్దరు తండ్రి కొడుకులు కారు కొనడానికంటూ వచ్చారు. డ్రైవింగ్ పరీక్ష చేస్తామని మెర్సిడీస్ కారుతో వెళ్లి అటునుంచి అటే ఉడాయించారు. తిరిగి వారిని గుర్గావ్లో పోలీసులు అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేశారు.