'డర్టీ హరి' హీరోయిన్‌తో కార్తికేయ.. | Kartikeya And Ruhani In Top Banners New Film | Sakshi
Sakshi News home page

బడా బ్యానర్‌లో ఛాన్స్‌ కొట్టేసిన కార్తికేయ

Jul 16 2021 2:02 PM | Updated on Jul 16 2021 2:02 PM

Kartikeya And Ruhani In Top Banners New Film - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో యూత్‌లో మాంచి క్రేజ్‌ సంపాదించుకున్న కార్తికేయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలె కార్తికేయ నటించిన చిత్రం చావు కబురు చల్లగా యావరేజ్‌ టాక్‌ను సంపాదిచుకుంది. ప్రస్తుతం 'రాజా విక్రమార్క' అనే ప్రాజెక్టులో నటిస్తున్న కార్తికేయ ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తికేయకు జోడీగా  'రుహాని శర్మ'ను ఫిక్స్‌ చేశారట. 'డర్టీ హరి' చిత్రంతో రుహాని మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. లవ్‌ రొమాంటిక్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ  సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ పరిచయం కానున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement