కార్తీక పెళ్లాడబోయేది ఇతడ్నే.. వరుడిని చూపించిందిగా! | Karthika Nair Introduced Her Fiance Through Social Media Post - Sakshi
Sakshi News home page

Karthika Nair: కాబోయే భర్తను పరిచయం చేసిన రంగం హీరోయిన్‌

Published Wed, Nov 15 2023 3:44 PM | Last Updated on Wed, Nov 15 2023 3:59 PM

Karthika Nair Introduced Her Fiance to Social Media - Sakshi

హీరోయిన్‌ రాధిక త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. తన నిశ్చితార్థం ఉంగరాన్ని హైలైట్‌ చేసేలా ఓ ఫోటోను గత నెలలో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో కాబోయే భర్త ముఖాన్ని రివీల్‌ చేయలేదు. తాజాగా తను జీవితం పంచుకోబోతున్న వరుడెవరో బయటపెట్టింది. 'నిన్ను కలవడం విధి.. నీతో ప్రేమలో పడటం ఒక మ్యాజిక్‌.. నీతో కలిసి జీవితం పంచుకోవడానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభించాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కార్తీక పెళ్లాడబోయే వ్యక్తి పేరు రోహిత్‌ మీనన్‌.

అతడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కార్తీక.. జోష్‌ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో పలు సినిమాలు చేసిన ఆమె రంగం సినిమాతో క్రేజ్‌ సొంతం చేసుకుంది. తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో దమ్ములో నటించింది. అల్లరి నరేశ్‌తో బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి సినిమాలో నటించిన ఆమె 2015 నుంచి వెండితెరకు దూరంగా ఉంటోంది.

చదవండి: మూడు రోజుల్లో 25 సినిమాలు.. ఆ మూడు మాత్రమే స్పెషల్!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement