
బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor) మాజీ భర్త సంజయ్ కపూర్(53) గుండెపోటుతో మృతి చెందాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంలో .. ఇంగ్లాండ్‌లో సంజయ్ పోలో అడుతుండగా నోట్లోకి అకస్మాత్తుగా ఒక తేనెటీగ దూరిందట. దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి, ఆయనకు ఊపిరాడలేదు. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని సమాచారం. వెంటనే ఆటను నిలిపివేసి, ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్వ్యాపారవేత్తలలో ఒకరు. 2003లో కరిష్మాని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేధాలు వచ్చాయి. దీంతో ఇద్దరు 2014లో విడాకులకు దరఖాస్తు చేయగా.. 2016లో విడాకులు మంజూరు అయ్యాయి. ఆ తర్వాత మోడల్, నటి ప్రియా సచ్‌దేవ్‌ను సంజయ్ పెళ్లాడారు. కరిష్మా మాత్రం ఒంటరిగానే ఉంటోంది.