స్టార్ హీరోయిన్ క్రేజీ థ్రిల్లర్ సినిమా.. రిలీజైన ట్రైలర్ | Kareena Kapoor's The Buckingham Murders Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

The Buckingham Murders: మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?

Sep 3 2024 3:29 PM | Updated on Sep 3 2024 3:58 PM

Kareena Kapoor's The Buckingham Murders Movie Telugu Trailer

థ్రిల్లర్ సినిమాలకు ఉండే డిమాండ్ వేరు. సరిగా తీయాలే గానీ అద్భుతమైన సక్సెస్ అవుతాయి. అలా ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ లీడ్ రోల్ చేసిన సినిమా 'ద బకింగ్‌హామ్ మర్డర్స్'. బీఎఫ్ఐ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గతేడాది ఈ మూవీని ప్రదర్శించారు. దీన్ని ఇప్పుడు సెప్టెంబరు 13న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదల చేశారు.

(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)

ట్రైలర్ బట్టి చూస్తే బకింగ్‌హామ్ షైర్ ప్రాంతంలో ఓ పిల్లాడు హత్యకు గురవుతాడు. అది కూడా పిల్లల దినోత్సవం అయిన నవంబరు 14న. దీంతో ఇండో-బ్రిటీష్ డిటెక్టివ్ తన పరిశోధన మొదలుపెడుతుంది. ఐదుగురిని అనుమానిస్తుంది. ఇంతకీ ఆ పిల్లాడ్ని ఎవరు చంపారు? చివరకు ఏమైందనేదే స్టోరీ. దీన్ని ప్రెజెంట్ చేసేలానే ట్రైలర్ కట్ చేశారు.

'1992 స్కామ్' సినిమాతో దర్శకుడు తన మార్క్ చూపించిన హన్సల్ మెహతా.. 'ద బకింగ్‌హామ్ మర్డర్స్' మూవీకి దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా అనిపించింది. మరి మూవీ ఎలా ఉంటుందనేది వచ్చే వారానికి తెలిసిపోతుంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 8'లో కుక్కర్ పంచాయతీ.. ఆమెకి ఎలిమినేషన్ గండం?)

Advertisement
 
Advertisement
Advertisement