పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే! | Karan Arjun vs Pushpa Re Release: Who has Earned More and By How Much? | Sakshi
Sakshi News home page

Pushpa Movie: వెనకబడ్డ పుష్ప.. కలెక్షన్స్‌ రూ.1 కోటి కూడా రాలే!

Nov 27 2024 8:57 PM | Updated on Nov 28 2024 9:37 AM

Karan Arjun vs Pushpa Re Release: Who has Earned More and By How Much?

క్లాసిక్‌, బ్లాక్‌బస్టర్‌ సినిమాలను మళ్లీ రిలీజ్‌ చేయడం ఇప్పుడు ప్యాషన్‌ అయిపోయింది. అల్లు అర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన సూపర్‌ హిట్‌ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్‌ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్‌ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్‌ క్లాసిక్‌ కరణ్‌ అర్జున్‌ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.

ఏ సినిమా కలెక్షన్స్‌ ఎంతంటే?
పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్‌ ట్రెండ్‌లో కరణ్‌ అర్జున్‌, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్‌ ఖాన్‌ 'కల్‌ హో నా హో' సినిమా కూడా నవంబర్‌ 15న రీరిలీజ్‌ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.

పుష్ప 2
ఇకపోతే అల్లు అర్జున్‌ పుష్ప 2 మూవీ డిసెంబర్‌ 5న విడుదల కానుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement