రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చాప్టర్-1 నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఛావాను కూడా అధిగమించింది.
అయితే ఈ మూవీలో టైగర్ ఫైట్ సీక్వెన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అలాంటి పులి బొమ్మను కొందరు రీ క్రియేట్ చేశారు. అలా బొమ్మను సృష్టించేందుకు తెగ శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో షేర్ చేశారు. ఇలా పులిని తయారు చేసేందుకు టన్నుల కొద్ది వేస్ట్ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు ఈ బొమ్మ టైగర్‌ను సృష్టించిన ఆర్టిస్ట్ వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ బొమ్మ కేరళలో ఉందని పంచుకున్నారు.


