కన్నప్పలో కథానాయికగా..  | Kannappa: Preeti Mukundan as heroine in Vishnu Manchu dream project Kannappa official announcement | Sakshi
Sakshi News home page

కన్నప్పలో కథానాయికగా.. 

Dec 15 2023 3:50 AM | Updated on Dec 15 2023 3:50 AM

Kannappa: Preeti Mukundan as heroine in Vishnu Manchu dream project Kannappa official announcement - Sakshi

ప్రీతీ  ముకుందన్‌

కన్నప్పలో భాగమయ్యారు ప్రీతీ ముకుందన్‌. శివ భక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. ప్రభాస్, మోహన్‌బాబు, బ్రహ్మానందం, మోహన్‌లాల్, శివరాజ్‌ కుమార్, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ న్యూజిల్యాండ్‌లో జరుగుతోందని సమాచారం.

ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ప్రీతీ  ముకుందన్‌ను ఎంపిక చేసినట్లు గురువారం చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ‘‘ప్రీతికి ఇది తొలి సినిమా. ‘కన్నప్ప’ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుంది. నాట్య కళలో ప్రీతికిప్రావీణ్యం ఉంది. ‘కన్నప్ప’లో ఆమె పాత్రకు కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement