Kannada TV Actress Jyothi Rai Relation With Director Suku Purvaj, Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Jyothi Rai Love Affair Rumours: డైరెక్టర్‌తో పీకల్లోతు ప్రేమలో బుల్లితెర నటి..?

Jul 23 2023 6:52 PM | Updated on Jul 24 2023 11:25 AM

Kannada TV Actress Jyothi Rai Relation With Director Suku Purvaj - Sakshi

గుప్పెడంత మనసు సీరియల్‌ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్‌ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు.  ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్ అనే క్రైమ్ థిల్లర్ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్‌ పోషిస్తోంది. తాజాగా శాండల్‌వుడ్‌ భామకు సంబంధించిన ఓ న్యూస్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో ఓ లుక్కేద్దాం.

 

బుల్లితెర భామ జ్యోతిరాయ్ ఓ యువ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే వీరి బంధం నిజమేనని తెలుస్తోంది.  గతంలో శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుకు పుర్వాజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాలు రెండూ ఓటీటీ వేదికగా అలరిస్తున్నాయి. ప్రస్తుతం  ఏ మాస్టర్ పీస్ అనే చిత్రాన్ని సుకు తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: అసలు ఆ డైలాగ్స్ ఏంటి.? ఆలియా భట్‌ మూవీపై తీవ్ర అభ్యంతరం!)

వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ ఇన్‌స్టాలో ఫోటోలు షేర్‌ చేయడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అంతే కాకుండా వీళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సీరియల్ నటి సుజాత పెట్టిన కామెంట్‌ చూస్తే తెలిసిపోతుంది. సుజాత  'లవ్ లవ్ అండ్ లవ్ యూ బోత్.. కీప్ రాకింగ్ ఆల్వేస్' అంటూ కామెంట్ పెట్టగా.. ‘థాంక్యూ డియర్’ అంటూ జ్యోతిరాయ్ కూడా రిప్లై ఇచ్చింది.

కాగా..  జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. జ్యోతిరాయ్ నటి  కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. దీంతో  జ్యోతిరాయ్.. దర్శకుడు సుకు పుర్వాజ్ అలియాస్ సురేశ్ కుమార్‌తో రిలేషన్‌లో ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. సీరియల్స్‌తో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది జ్యోతి రాయ్.

(ఇది చదవండి: మద్యానికి బానిసైన సన‍్నీ లియోన్ తల్లి.. ఆ వీడియోల వల్లే!

కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతిరాయ్.. మంగళూరులో చదివుకుంది. జ్యోతి రాయ్ కన్నడలో విను బలాంజ సీరియల్ 'బందె బరాటవ కాలా' ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్స్‌లో నటించింది. జ్యోతి 'జోగుల', 'జో జో లల్లీ', 'గెజ్జేపూజే', 'శుభమంగళ', 'లవలవికే', 'ప్రేరణ', 'కిన్నెరి', 'సిల్లీ లల్లీ', 'సవలిగే సై', 'మురు గంటు', 'శాంతల', 'కన్యాశుల్కం' వంటి సినిమాల్లోనూ కనిపించింది. 20కి పైగా సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్‌.. తుళు, కన్నడ, తమిళం, తెలుగు భాషల్లో నటించారు. వీటితో పాటు 'సీతారామ కళ్యాణ', 'గంధాడ్ గుడి', '99', 'దియ వర్ణపాటల' సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు వెబ్ సిరీస్‌ల వైపు మళ్లింది. 


 

Advertisement
 
Advertisement
Advertisement