Kannada Hero Darshan: చెప్పుతో దాడి.. తొలిసారి స్పందించిన దర్శన్‌

Kannada Hero Darshan Respond On Slipper Incident, Pens Long Note - Sakshi

ఇటీవల తనపై జరిగిన దాడిపై కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ తొలిసారి స్పందించాడు. దర్శన్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘క్రాంతి’ సినిమాలో రెండవ పాటను ఇటీవల కర్ణాటకలోని హోస్పేట్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శన్‌ స్టేజీపై అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అతడిపై చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనను ఖండిస్తూ కన్నడ హీరో సుదీప్‌ అసహనం వ్యక్తం చేశాడు. అలాగే ఇలాంటి దాడులు సహించలేనివి అంటూ శివరాజ్‌ కుమార్‌ మండిపడ్డారు.

చదవండి: నటి జయప్రదకు షాక్‌, మాజీ ఎంపీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

అలాగే మరో నటుడు ధనుంజయ్‌, రమ్యలు సైతం దీనిపై స్పందిస్తూ దర్శన్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో ఇలాంటి ఈ క్లిష్ట పరిస్థితిలో తనకు అండగా నిలిచిన తన స్నేహితులకు దర్శన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. ‘‘ఈ సమయంలో నాకంటే కూడా నా సహ నటీనటులు ఎక్కువగా బాధపడుతున్నారని అర్థమైంది. ఇలాంటి ఘటనలు ఒక మనిషిని బలహీనపరచవు. మరింత దృఢంగా మారుస్తాయి. మన సొంత కన్నడ నేలపైనే గతంలో ఇలాంటి ఎన్నో సంఘటనలను చూశాం.

చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్‌ రేవంత్‌, వీడియో వైరల్‌

ఈ క్లిష్ట సమయంలో నాకోసం నిలబడి, నాకు మద్దతు ఇచ్చిన స్నేహితులు, నటీనటులకు కృతజ‍్క్షతుల. సినిమా ఈవెంట్‌ను పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లకూ ధన్యవాదాలు. ఒక కార్యక్రమాన్ని నాశనం చేయడానికి వంద మంది వ్యక్తులు ఉంటే.. కొన్ని వేల మంది సెలబ్రిటీలు రంగంలోకి దిగుతారని నేను మొదటి నుంచే చెబుతున్నాను. అదే జరిగింది. నాపై పలువురు వ్యక్తులు కనబరుస్తోన్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అంటూ దర్శన్‌ రాసుకొచ్చాడు. కాగా ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు దర్శన్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌ అభిమానులు గొడవ పడ్డారని, కాబట్టి పునీత్‌ అభిమానే ఇలా చేశారని వార్తలు వచ్చాయి. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top