Singer Revanth: తోలిసారి కూతురిని కలుసుకున్న బిగ్‌బాస్‌ విన్నర్‌ రేవంత్‌

Singer Revanth Meets His Daughter First Time After Bigg Boss Title Won - Sakshi

బిగ్‌బాస్‌ 6 తెలుగు విజేత, సింగర్‌ రేవంత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టిన రేవంత్‌ తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదటి నుంచి టైటిల్‌ గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేశాడు. చెప్పినట్టుగా బిగ్‌బాస్‌ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. 15 వారాల పాటు హౌజ్‌లో సందడి చేసిన రేవంత్‌ బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండగానే తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య అన్విత ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సంతోషకర సమయంలో భార్య పక్కనే లేనని, బిడ్డను ఎత్తుకోలేకపోయానంటూ రేవంత్‌ ఇంట్లో కన్నీరు పెట్టుకున్నాడు. 

చదవండి: ఆస్కార్‌ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

ఇక ఎట్టకేలకు హౌజ్‌ నుంచి బయటకు రాగానే రేవంత్‌ తన కూతురిని తొలిసారి కలుసుకున్నాడు. టైటిల్‌తో బయటకు వచ్చిన రేవంత్‌కు ఆయన భార్య గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది. అంతేకాదు ఎప్పటికి గుర్తుండిపోయేలా బిడ్డను తొలిసారి రేవంత్‌ చేతికి ఇచ్చింది. విజేతగా ఇంటికి వెళ్లిన రేవంత్‌కు ఇది డబుల్‌ ధమాకా అనే చెప్పాలి. అటూ విన్నర్‌గా నిలిచి తొలిసారి తన కూతురిని చూడపోతున్నాడు. బిగ్‌బాస్‌ ట్రోఫీతో ఇంటికి వెళ్లిన రేవంత్‌ కళ్లకు గంతలు కట్టి లోపలికి తీసుకేళ్లారు. పాప దగ్గరికి వెళ్లగానే కళ్ల గంతలు తీసి కూతురిని రేవంత్‌ చేతికి అందించింది భార్య అన్విత. 

చదవండి: భారీగా రెమ్యునరేషన్‌ పెంచిన విజయ్‌.. తలైవాను అధిగమించాడా?

పాపను అపురూపంగా చేతిలోకి తీసుకుంటూ రేవంత్‌.. తండ్రిగా ఎమోషనల్ అయిపోయాడు. తొలిసారి రేవంత్‌ తన బిడ్డను కలిసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తండ్రిగా కూతురిని చూసుకుని మురిసిపోతున్న రేవంత్‌ ఈ వీడియో అతడి ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దీనికి ‘క్యూట్‌ వీడియో’, ‘మోస్ట్‌ అడారబుల్‌ మూమెంట్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్‌ విజేతగా నిలచి టైటిల్‌ను తన బిడ్డకు అంకితం ఇస్తానంటూ రేవంత్‌ మొదటి చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top