Up Court Issues Non Bailable Warrant Against Actress And Ex MP Jaya Prada, Details Inside - Sakshi
Sakshi News home page

Jaya Prada Poll Code Violation: నటి జయప్రదకు షాక్‌, మాజీ ఎంపీపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Published Thu, Dec 22 2022 12:21 PM | Last Updated on Thu, Dec 22 2022 1:30 PM

Up Court Issues Non Bailable Warrant Against Actress, Ex MP Jaya Prada - Sakshi

సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇష్యూ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ రాంపూర్ ప్రత్యేక కోర్టు జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసి షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులకు సంబంధించి ఆమెకు వారెంట్‌ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్‌నాథ్‌ తివారీ తెలిపారు. వివరాలు.. 2019లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియయావళిని ఉల్లంఘించినందుకు గాను ఆమెపై వేర్వేరుగా రెండు కేసు నమోదయ్యాయి.

చదవండి: తొలిసారి కూతురిని చూసి ఎమోషనలైన సింగర్‌ రేవంత్‌, వీడియో వైరల్‌

ఈ కేసుల విచారణ సమయంలో జయప్రద వరుసగా కోర్టుకు హాజరుకాకపోవడం కోర్టు ఆమె తీరుపై ఆగ్రం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే జయప్రదపై తాజాగా రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. అంతేకాదు వచ్చే మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదని కోర్టులో హజరుపరచాలని రాంపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసును కోర్టు ఆదేశించినట్లు న్యాయవాది అమర్‌నాథ్‌ తెలిపారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

చదవండి: భారీగా రెమ్యునరేషన్‌ పెంచిన విజయ్‌.. తలైవాను అధిగమించాడా?

కాగా 2019 ఏప్రిల్‌ 18న పిపారియా మిశ్రా గ్రామలో జరిగిన ఓ బహిరంగ సభకు సంబంధించి వీడియో నిఘా బృందం ఇన్‌ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. అలానే.. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్‌పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో 2019 ఏప్రిల్‌ 19న ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్‌ జయప్రద మీద మరో కేసు నమోదు చేశారు. ఈ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన జయప్రద.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అజం ఖాన్ చేతిలో లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement