కంగువ ఎడిటర్‌ నిషాద్‌ హఠాన్మరణం | Kanguva editor Nishadh Yusuf dead | Sakshi
Sakshi News home page

కంగువ ఎడిటర్‌ నిషాద్‌ హఠాన్మరణం

Oct 31 2024 2:45 AM | Updated on Oct 31 2024 2:45 AM

Kanguva editor Nishadh Yusuf dead

సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువ’కి ఎడిటర్‌గా చేసిన నిషాద్‌ యూసుఫ్‌ (43) ఆకస్మిక మృతి చెందారు. నిషాద్‌ స్వస్థలం కేరళలోని చంగనస్సేరి. తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో నివాసం ఉంటున్నారు. స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున ఆయన విగత జీవిగా కనిపించారు.

ఇక నిషాద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఆర్థిక సమస్యలా? కుటుంబ కలహాలా? ఎవరైనా గిట్టని వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ‘చావెర్, ఉండా, తల్లుమాలా, సౌదీ వెళ్లాక, వన్, ఆపరేషన్‌ జావా’ వంటి పలు సినిమాలకు ఎడిటర్‌గా చేశారు నిషాద్‌. ఆయన పని చేసిన చివరి చిత్రాలు ముమ్మట్టి నటించిన ‘బజూక’, సూర్య నటించిన ‘కంగువ’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement