
Kangana Ranaut on Mahesh Babu Comments: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలె బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ తనను భరించలేదన్న మహేశ్ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా వీటిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. తను నటించిన ‘ధాకడ్' మూవీ ట్రైలర్ రిలీజ్‌లో భాగంగా కంగనా మాట్లాడుతూ..
'అవును మహేశ్ బాబు అన్నది నిజమే.ఆయన్ను బాలీవుడ్ భరించలేదు. ఎందుకంటే బాలీవుడ్ నుంచి ఎంతోమంది ఆయనతో సినిమా కోసం సంప్రదించారో నాకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్ దేశంలోనే నెం1 ఇండస్ట్రీగా ఉంది. కాబట్టి ఆయనకి తగిన రెమ్యునరేషన్‌ని బాలీవుడ్ ఇవ్వలేదు.
అయినా మహేశ్ చేసిన కామెంట్స్‌ని ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారో అర్థం కావట్లేదు. టాలీవుడ్‌పై, తన పనిపైనా మహేశ్‌బాబు గౌరవం చూపడం వల్లే ఆయన ఈ స్థాయిలో ఉండగలిగారు. దాన్ని మనందరం అంగీకరించాలి' అని పేర్కొంది. అంతేకాకుండా టాలీవుడ్‌ను చూసి చాలా నేర్చుకోవాలంటూ చెప్పుకొచ్చింది. చదవండి: అందుకే నాకింకా పెళ్లి కావట్లేదు : కంగనా రనౌత్