Kangana Ranaut Says She Is Unable To Get Married Because Of Rumours About Her, Details Inside - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: పెళ్లిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన హీరోయిన్‌ కంగనా

May 12 2022 12:04 PM | Updated on May 12 2022 1:44 PM

Kangana Ranaut Says She Is Unable To Get Married Because Of Rumours - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఏం చేసినా, ఏం చెప్పినా అది సెన్సేషన్‌ అవుతుంది. తాజాగా తన పెళ్లిపై కంగనా చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇటీవలె కాంట్రవర్సీ లాకప్‌ షోను కంప్లీట్‌ చేసిన కంగనా త్వరలోనే  ధాకడ్‌ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె ఏజెంట్‌ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. చదవండి: షారుక్‌ ఖాన్‌తో విభేదాలపై స్పందించిన కాజోల్‌ భర్త

మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కంగనా సిద్ధార్థ్‌ కన్నన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. మీరు నిజజీవితంలో కూడా టామ్‌ బాయ్‌ మాదిరే ఉంటారా అని ప్రశ్నించగా.. 'నిజజీవితంలో నేను ఎవరిని కొట్టాను చూపించండి.. మీరు ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు. నేను ఊరికే అందరితో గొడవ పడతానేమో అని జనాలు అనుకుంటున్నారు' అంటూ నవ్వుతూ చెప్పింది.  ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలోఎ వైరల్‌గా మారాయి. చదవండి: 'ఆట' డ్యాన్స్‌ షో విన్నర్‌ టీనా కన్నుమూత


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement