నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా | Kangana Ranaut Comments On Movie Collections | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: నా గురించి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బు వృథా చేసుకోకండి: కంగనా

Aug 15 2023 7:33 AM | Updated on Aug 15 2023 7:34 AM

Kangana Ranaut Comments On Movie Collections - Sakshi

బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈమెను వివాదాలకు కేంద్ర బిందువు అంటారు. తాను విమర్శించ తలుచుకుంటే వారు ఎంతటి వారనే విషయాన్ని ఆమె పట్టించుకోరని అంటారు. ఈ విషయంలో సినిమా వారినే కాదు, రాజకీయవాదులను కూడా వదిలిపెట్టరు. అయితే నటిగా మాత్రం కంగనా రనౌత్‌ను వంకపెట్టలేం. ఈ బహుభాషా నటి నిర్మాత, దర్శకురాలు కూడా.

ముఖ్యంగా తమిళంలో ధామ్‌ ధూమ్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ మధ్య దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ తలైవి చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించి మెప్పించారు. తాజాగా పి.వాసు దర్శకత్వంలో లారెన్‌న్స్‌ కథానాయకుడిగా నటిస్తున్న చంద్రముఖి– 2 చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించారు. ఈ చిత్రం వచ్చే నెల తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. ఈమె పాత్రను బేస్‌ చేసుకునే చిత్రవర్గాలు ప్రచారం చేస్తుండటం విశేషం. కాగా నటి కంగనా రనౌథ్‌ తాజాగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్విట్టర్‌ ద్వారా విరుచుకు పడ్డారు.

అందులో తనకు వ్యతిరేకంగా డబ్బిచ్చి మరీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. తన చిత్రాల వసూళ్ల గురించి ఇలాంటి అవాస్థవాలే ప్రచారం చేస్తున్నారన్నారు. అయితే అలా చేసేవారి ఆత్మకు సంతృప్తి కలగాలని అన్నారు. రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించిన తన చిత్రాలను ప్లాప్‌ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీని వెనుక ఒక పెద్ద మాఫియా ఉందని అన్నారు. ఇలాంచి సంకుచిత భావాలు వీరికి ఎలా వస్తాయో తెలియడం లేదన్నారు. ఇతరులను చెడ్డవారిగా చిత్రీకరించడానికి రాత్రింబవళ్లు ఆలోచించి డబ్బులు వృథా చేస్తున్నారని నటి కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

(ఇదీ చదవండి: 'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌)

Advertisement
 
Advertisement
Advertisement