Kangana Ranaut Comments on Allu Arjun and Yash - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: 'అందుకే ఇంత స్టార్‌డమ్‌'..సౌత్‌ స్టార్స్‌ను ఆకాశానికెత్తేసిన కంగనా..

Jan 24 2022 2:57 PM | Updated on Jan 25 2022 1:11 PM

Kangana Ranaut Comments on Allu Arjun and Yash - Sakshi

ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు కాంట్రవర్సరీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సౌత్‌ స్టార్స్‌పై కంగనా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్నాయి. బాలీవుడ్‌ కల్చర్‌, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి తనదైన స్టైల్‌లో బాలీవుడ్‌పై విరుచుకుపడింది. అయితే ఈసారి సౌత్‌ ఇండస్ట్రీని పొగడ్తలతో ముంచెత్తింది.

సౌత్‌ స్టార్స్‌ అల్లు అర్జున్‌,యశ్‌ల ఫోటోలు షేర్‌ చేసిన కంగనా దక్షిణాది హీరోలకు, సినిమాలకు ఎందుకు అంత ఆదరణ లభిస్తుందన్నది ప్రస్తావించింది. దక్షిణాది స్టార్స్‌ మన దేశ సంస్కృతి సంప్ర‌దాయ మూలాల‌కు క‌ట్టుబ‌డి ఉంటారు. వారు త‌మ కుటుంబాల‌కు, బాంధ‌వ్యాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తారు. సినిమాపై సినిమాపై వారికున్న ప్యాష‌న్‌, వృతిప‌ర‌మైన నిబ‌ద్ధ‌త అపార‌మైన‌ది అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

అంతేకాకుండా బాలీవుడ్‌ మిమ్మల్ని పాడు చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. వారి వ‌ల‌లో చిక్కుకోకండి అంటూ పేర్కొంది. దీనికి పుష్పలోని ఊ అంటావా.. ఊఊ అంటావా అనే సాంగ్‌ను సైతం యాడ్‌ చేసింది. ఇక కేజీఎఫ్‌, పుష్ప సినిమాలతో యశ్‌, అల్లుఅర్జున్‌ పాన్‌ ఇండియా స్థాయిలో ఎంతలా పాపులారిటీ తెచ్చుకున్నారో తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement