
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్‌కు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఆయనకు కోలీవుడ్ బుల్లితెర నటుడు రవిచంద్రన్ కమల్ను బెదిరించినట్లు తెలుస్తోంది. ఇటీవల సనాతన ధర్మంపై కమల్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కమల్ హాసన్‌ను చంపేస్తానంటూ మాట్లాడినట్లు సమాచారం. ఈ బెదిరింపులపై మక్కల్ నీది మయ్యం పార్టీ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కమల్ హాసన్‌కు రక్షణ కల్పించాలని కోరారు.
కాగా.. ఇటీవలే రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్ హాసన్.. అగరం ఫౌండేషన్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అడ్డుకోవాలంటే విద్య ఒక్కటే మార్గమని మాట్లాడారు. అంతేకాకుండా వైద్య విద్య సీట్ల కోసం కేంద్రం నిర్వహిస్తోన్న నీట్ పరీక్షపై విమర్శలు చేశారు. దీంతో కమల్ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి.
అయితే ఈ మాటలు విన్న బుల్లితెర నటుడు రవిచంద్రన్ కమల్ను అమాయక రాజకీయ నాయకుడు అంటూ ఎద్దేవా చేశారు. మరోసారి ఇలాగే మాట్లాడితే కమల్ గొంతు కోస్తానని హెచ్చరించారు. కమల్ వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ సైతం ఖండించింది. దీంతో ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే కమల్ హాసన్ ఈ ఏడాది థగ్ లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది.