చిత్ర పరిశ్రమలో ఇంకా వివక్ష ఉంది.. కాజల్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Kajal Aggarwal Says There Is Discrimination In The Film Industry | Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమలో ఇంకా వివక్ష ఉంది.. కాజల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Jun 8 2026 8:30 AM | Updated on Jun 8 2026 11:04 AM

Kajal Aggarwal Says There Is Discrimination In The Film Industry

అందం, ఐశ్వర్యం, ఆనందం, ఆసక్తి, ఆకర్షణ, నిరాకరణ, సంతృప్తి, అసంతృప్తి, ఆవేదన అన్నీ కలగలిపిన పరిశ్రమ సినిమా. ఇక్కడ ప్రతిభ, అదృష్టాలను పరీక్షించుకుని ఉన్నంత స్థాయికి చేరుకున్న వారు ఎందరో. తమ కలలను పండించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నా వారు ఉన్నారు. అదే సమయంలో వివక్ష గొంతెత్తే వారు ఉంటూనే ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు కాజల్‌ అగర్వాల్‌ చేరారు.

 లక్ష్మీకల్యాణం అనే తెలుగు చిత్రంతో కథానాయికిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుసగా అవకాశాలను అందుకుంటూ అగ్ర కథానాయిక స్థాయికి చేరారు. కాజల్‌ బిజీగా ఉన్న తరుణంలోనే పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి ప్రవేశించారు. అలా ఒక బిడ్డకు తల్లి కూడా అయినా ఈ ఉత్తరాది భామ మళ్లీ నటనపై దృష్టి పెట్టారు. కాజల్‌ తాజాగా నటించిన ది ఇండియా స్టోరీ చిత్రం జూలై 24న తెరపైకి రానుంది. 

కమలహాసన్‌తో కలిసి నటించిన ఇండియన్‌–3 చిత్రం విడుదల కావలిసి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌ సందర్భం వచ్చినప్పుడల్లా గ్లామర్‌ ను ప్రదర్శిస్తూ అవకాశాల వేటలో పడుతున్నారు. 

తాజాగా చిత్రపరిశ్రమలో వివక్ష గురించి ఒక ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. పారితోషికం విషయంలో ఆడ, మగ మధ్య వివక్ష లేదని చెప్పలేను కానీ ఈ పరిస్థితి మారాలి. సినిమా ఇప్పుడు కార్పొరేట్‌గా మారిపోతోంది. అయినా ఆడ, మగ మధ్య పారితోషికం విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. నాకు అక్కడ లేని సౌకర్యం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కలుగుతుందని కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement