Kachcha Badam Singer Bhuban Badyakar Receives 3Lakhs Remuneration From Music Company - Sakshi
Sakshi News home page

Kacha Badam: 'కచ్చా బాదమ్‌' సింగర్‌ రెమ్యునరేషన్‌.. మరీ ఇంత తక్కువా!

Feb 19 2022 10:10 AM | Updated on Feb 19 2022 11:33 AM

Kacha Badam Singer Bhuban Badyakar Receives 3Lakh From Music Company - Sakshi

Kacha Badam Singer Bhuban Badyakar Receives Rs 3Lakhs: కచ్చా బాదమ్‌.. ఇప్పుడు సోషల్‌మీడియాను ఊపేస్తున్న సాంగ్‌ ఇది. సెలెబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హుషారైన స్టెప్పులతో మిలియన్ల కొద్దీ జనం ఈ సాంగ్‌ను తెగ ఎంజాయ్‌ చేసేస్తున్నారు. పల్లీలు అమ్ముకునే సాధారణ వ్యక్తి ఈ పాటను క్రియేట్ చేయగా.. దానికి 'గోధూలిబేల మ్యూజిక్' కంపెనీ రీమిక్స్‌ వెర్షన్‌ను జోడించి సోషల్ మీడియలోకి వదిలారు. అంతే ఈ పాటకు లక్షల కొద్దీ వ్యూస్‌ వచ్చిపడుతున్నాయి. అంతలా ఫేమస్‌ అయిపోయింది.

ఈ పాట ఒరిజినల్‌ క్రియేటర్‌  పశ్చిమ్​ బెంగాల్​కు చెందిన ఆయన ఓ చిరు వ్యాపారి భుబన్ బద్యాకర్. గ్రామాల్లో సైకిల్​పై తిరుగుతూ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటారు. తన పల్లీలు కొనేలా జనాలను ఆకర్షించేందుకు ఇలా సొంతంగా తానే లిరిక్స్ రాసుకుని పాడారు. అంతే ఈ కచ్చాబాదమ్‌ సాంగ్‌తో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు బద్యాకర్‌. అయితే ఈ సాంగ్‌ ఇంత సెన్సేషన్‌గా మారినా అతను ఆర్ధికంఆ ఏమైనా లబ్దిపొందాడా లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సదరు మ్యూజిక్ కంపెనీ బద్యాకర్ నుంచి కచ్చా బాదమ్ రైట్స్ కొనేసింది. ఈ ఒప్పందంలో భాగంగా బద్యాకర్‌కు రూ.3 లక్షల రెమ్యునరేషన్ చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాం. అతనికి అడ్వాన్స్‌గా రూ. 1.5 చెక్కు అందించాం. మిగిలిన మొత్తం వచ్చే వారం అతనికి చెల్లిస్తాం’ అని గోధూలిబేల మ్యూజిక్ గోపాల్ ఘోష్ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement