
ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీలకు అలవాటుపడ్డారు. ఇక ప్రేక్షకుల నాడిని పసిగట్టిన ఓటీటీ సంస్థలు.. ఢిపరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీలను విడుదల చేస్తున్నాయి. మరి ఈ వీక్‌లో విడుదల కాబోయే చిత్రాలు, వెబ్ సీరీస్‌లు ఏంటో చూద్దాం.
అమలాపాల్ లీడ్ రోల్ తెరకెక్కిన చిత్రం ‘కుడి ఎడమైతే’. ఈ నెల 16న ఆహాలో ఈ మూవీ విడుదలకు కానుంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు పవన్‌కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో అమలా పాల్ పవర్ ఫుల్ పోలీసు అధికారినిగా అలరించనుంది.
ఇక మలయాళ నటుడు పహాద్ ఫాజిల్ తాను నటించిన చిత్రాలను వరుసగా ఓటీటీలో విడుదల చేస్తున్నాడు. 30 కోట్ల బడ్జెట్‌తో మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందిన ‘మాలిక్’ చిత్రాన్ని మొదట థియేటర్‌లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ మూవీ ఈ నెల 15న అమెజాన్ ప్రైమ్ స్ర్టీమింగ్ కానుంది.
అలాగే పలు వివాదాలకు గురైన బాలీవుడ్ చిత్రం ‘తుఫాన్’ కూడా ఓటీటీ బాట పట్టింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఫరాన్ అక్తర్ కథానాయకుడిగా రాకేశ్ ఓం ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 16వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతోంది. వీటితోపాటు మరికొన్ని చిత్రాలు కూడా ఈ వారం ఓటీటీలో అలరించనున్నాయి.
ఓటీటీలో వస్తున్న మరికొన్ని చిత్రాల వివరాలు:
నెట్‌ఫ్లిక్స్
- గన్‌పౌడర్ మిల్క్‌షేక్ (జులై 14)
- నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఎస్2 (జులై 15)
- ఫియర్ స్ర్టీట్ 3(జులై 16)
- డీప్ (జులై 16)
- ఎ పర్ఫెక్ట్ ఫిట్(జులై 16)
- జానీ టెస్ట్ (జులై 16)
- కాస్మిక్ సిన్ (జులై 17)
- మిల్క్ వాటర్ (జులై 20)
డిస్నీ+ హాట్‌స్టార్
- ది వైట్ లోటస్ (జులై 13)
- క్యాచ్ అండ్ కిల్-ది పాడ్ క్యాస్ట్ టేప్స్ (జులై 13)
ఆహా
- కుడి ఎడమైతే (జులై 16)