Jr NTR And Kalyan Ram To Visit Taraka Ratna At The Bengaluru Hospital, Deets Inside - Sakshi
Sakshi News home page

Jr NTR-Kalyan Ram: తారకరత్నను చూసేందుకు బెంగళూరు బయలుదేరిన ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌

Jan 29 2023 10:09 AM | Updated on Jan 29 2023 1:02 PM

Jr Ntr And Kalyan Ram To Visit Taraka Ratna At The Bengaluru Hospital - Sakshi

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఎక్మో సపోర్ట్‌పైనే ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తారకరత్నను చూసేందుకు జూ ఎన్టీఆర్‌ ఇవాళ(ఆదివారం)బెంగళూరుకు వెళ్లనున్నారు. కల్యాణ్‌ రామ్‌తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇప్పటికే తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణకు ఫోన్‌ చేసి ఎన్టీఆర్‌ ఆరా తీశాడు.

ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరుకు చేరుకుంటున్నారు.కాగా తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement