నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా! | Journalist Serious On Anchor Suma Comments At Aadikeshava Movie Song Launch Event, Know Reasons Inside - Sakshi
Sakshi News home page

Anchor Suma Apologized: నోరు జారి క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ

Published Wed, Oct 25 2023 8:02 PM

Journalist Serious On Anchor Suma Adikeshava Movie Song Launch Event - Sakshi

యాంకర్ సుమ పేరు చెప్పగానే అద్భుతమైన యాంకర్ అని అంటారు. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ లేవు. కానీ కొన్నిసార్లు స్టేజీపై అతి చేసిన సందర్భాలు ఉన్నాయి. సెలబ్రిటీలు కాబట్టి ఆయా సందర్భాల్లో నవ్వి ఊరుకునేవాళ్లు. ఇప్పుడు ఏకంగా మీడియా వాళ్లతోనే సుమ పెట్టుకుంది. దీంతో ఓ జర్నలిస్టు ఈమెకి గట్టిగా కౌంటర్ ఇచ్చేశాడు. 

(ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?)

తెలుగమ్మాయి కాకపోయినా సరే తెలుగు యాంకర్‌గా సుమ వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకుంది. టీవీ షోల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు కచ్చితంగా సుమ ఉండాల్సిందే అనే రేంజుకి వెళ్లిపోయింది. కానీ గత కొన్నాళ్ల నుంచి ఈమె యాంకరింగ్‌లో మొనాటనీ వచ్చేసింది. అంటే బోర్ కొట్టించేస్తుంది. తాజాగా 'ఆదికేశవ' పాట లాంచ్ ఈవెంట్‌లోనే అలానే కాస్త అతి చేసింది.

ఈవెంట్ ప్రారంభానికి ముందు మీడియా వాళ్లని ఉద్దేశిస్తూ.. 'స్నాక్స్, భోజనంలా చేస్తున్నారు కదా! త్వరగా వచ్చి కెమెరాలు పెట్టండి' అని అంది. ఈ విషయమై సీరియస్ అయిన ఓ జర్నలిస్ట్.. అలా అనుకుండా ఉండాల్సిందని అన్నాడు. దీనిపై సెటైరికల్‌గా మాట్లాడిన సుమ.. 'స్నాక్స్ స్నాక్స్‌లానే తిన్నారు సరేనా' అని వ్యంగంగా మాట్లాడింది. 'ఇదే తగ్గించుకుంటే మంచిది' అని సదరు జర్నలిస్టు ఆమెపై సీరియస్ అయ్యాడు. దీంతో సుమ చివరకు క్షమాపణలు చెప్పి వాదన అక్కడితో ముగించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. వేడుక ముగిసిన తర్వాత మరోసారి మీడియా వారికి క్షమాపణలు చెబుతూ ఒక వీడియో మేసేజ్‌ను సుమ పంపారు.

(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)

Advertisement
 
Advertisement