జయం రవి హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ | Jayam Ravi Gears Up For 'Miruthan 2 With Shakti Soundar Rajan, Deets Inside | Sakshi
Sakshi News home page

జయంరవి హిట్‌ చిత్రానికి సీక్వెల్‌

Aug 4 2024 11:54 AM | Updated on Aug 4 2024 2:21 PM

 Jayam Ravi Gears Up for 'Miruthan 2 with Shakti Soundar Rajan

 చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు జయం రవి. ప్రస్తుతం ఈయన బ్రదర్‌, జీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో బ్రదర్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. కాగా నటుడు జయం రవి 2016లో కథానాయకుడిగా నటించిన చిత్రం మిరుదన్‌. నటి లక్ష్మీమీనన్‌ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని శక్తి సౌందర్‌రాజన్‌ తెరకెక్కించారు. 

నటి అనికా సురేందరన్‌ నటుడు జయం రవికి చెల్లెలిగా నటించగా, నటి లక్ష్మీమీనన్‌ ఆయన్ని ప్రేమించే నాయకిగా నటించారు. ఆమె జోంబీ బారిన పడడంతో తనను కాపాడే ప్రయత్నంలో పోలీస్‌ అధికారి అయిన జయం రవి కూడా జోంబీగా మారే ఇతి వృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్‌. కాగా ఈ తరహా జోంబీల ఇతి వృత్తంతో ఆంగ్లంలోనే వచ్చాయి. అలా తొలిసారిగా దక్షిణాదిలో జోంబీల ఇతివృత్తంతో రూపొందిన చిత్రం మిరుదన్‌. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. కాగా మిరుదన్‌ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ఆయన మొదలెట్టేశారట. 

వచ్చే ఏడాది ప్రఽథమార్థంలో మిరుదన్‌ 2 చిత్రం సెట్‌ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్నందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో నటుడు జయం రవి హీరోగా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే హీరోయిన్‌గా నటి లక్ష్మీమీనన్‌నే నటింపజేస్తారా? లేక మరెవరినైనా ఎంపిక చేస్తారా? అన్నది వేచి చూడాలి. అయితే ఇటీవల నటి లక్ష్మీమీనన్‌కు సరైన అవకాశాలు లేవన్నది గమనార్హం. దీంతో మిరుదన్‌ 2 చిత్రంలో మరో నటి నాయకిగా నటించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement