Jathi Ratnalu Bollywood Remake: Is Naveen Polisetty Will Play Lead Role? - Sakshi
Sakshi News home page

‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌, హీరో అతడేనట!

Apr 26 2021 2:42 PM | Updated on Apr 26 2021 5:44 PM

Jathi Ratnalu Remake In Hindi Naveen Polishetty Plays Lead Role - Sakshi

ఈ ఏడాది టాలీవుడ్‌ బాక్సాఫీసుకు బాగానే కలిసోచ్చిందని చెప్పుకొవచ్చు. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలైన మొదటి సినిమా ‘క్రాక్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇక ఆ తర్వాత విడుదలైన ‘ఉప్పెన’ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్‌లెన్త్‌ కామెడీతో ఈ మూవీ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంది.

అయితే ఇప్పటికే ‘క్రాక్‌’, ‘ఉప్పెన’ సినిమాలను హిందీలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘జాతి రత్నాలు’ మూవీ కూడా ఈ జాబితాలో చేరింది. తాజా బజ్‌ ప్రకారం ఈ మూవీని హిందీలో రీమేక్‌ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోను కూడా కన్ఫామ్‌ చేసినట్లు సమాచారం. అయితే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌కు కూడా అనుదీప్‌యే డైరెక్టర్‌గా వ్యవహరించన్నాడట.

ఇందులో హీరోను కూడా నవీల్‌ పొలీశెట్టిని అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. కాగా గతంలో నవీల్‌ పోలీశెట్టి సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ‘చిచోరే’ మూవీలో సహానటుడిగా కనిపించిన విషయం తెలిసిందే. అందుకే ‘జాతి రత్నాలు’ హిందీ రీమేక్‌ను కూడా నవీన్‌నే హీరోగా తీసుకోవాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉందట. అయితే దర్శకుడు అనుదీప్‌ ఇప్పటికే జాతి రత్నాలు మూవీకి సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనుదీప్‌ పూర్తి చేసినట్లు సమాచారం. 

చదవండి: 
‘జాతిరత్నం’ రేటు పెరిగింది.. మూడో సినిమాకే అన్ని కోట్లా?
జాతిరత్నాలు.. అసలు ఏంటా కామెడీ: టీమిండియా క్రికెటర్‌‌‌

Advertisement
 
Advertisement
Advertisement