'జపాన్' ఓ క్రేజీ దొంగ.. టీజర్ మాత్రం అదిరింది! | Japan Movie Teaser Telugu Karthi | Sakshi
Sakshi News home page

Japan Teaser: కార్తీ 'జపాన్' టీజర్.. ఆ డైలాగ్ మాత్రం వేరే లెవల్!

Oct 18 2023 7:00 PM | Updated on Oct 18 2023 7:00 PM

Japan Movie Teaser Telugu Karthi - Sakshi

హీరో కార్తీ మంచి నటుడు. పేరుకే తమిళ హీరో కానీ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చాలా  దగ్గరయ్యాడు. కార్తీ నుంచి ఓ మూవీ వస్తుందంటే చాలా మన ఆడియెన్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే కాన్సెప్టులు కాస్త డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు 'జపాన్'గా మాములు సందడి చేయలేదు.

(ఇదీ చదవండి: భగవంత్ కేసరి సినిమా రిలీజ్‪‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?)

టీజర్ ఎలా ఉంది?
కార్తీ హీరోగా నటిస్తున్న 25వ సినిమా 'జపాన్'. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. టీజర్‌లో భాగంగా కథేంటి? సినిమా ఎలా ఉండబోతుందనేది ఆల్మోస్ట్ చెప్పేశారు. కార్తీ లుక్ దగ్గర నుంచి డైలాగ్ మాడ్యులేషన్ వరకు అన్నీ వింటేజ్ స్టైల్లో డిఫరెంట్‌గా ఉన్నాయి. బంగారం దొంగతనం, బంగారు పళ్లతో కార్తీ కనిపించడం అన్నీ చూస్తుంటే.. 'జపాన్' బంగారం చుట్టూ తిరిగే ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా అనిపిస్తుంది.

కథేంటి?
'జపాన్' అనే దొంగ. రూ.200 కోట్ల విలువైన నగల్ని ఓ బంగారం షాప్ నుంచి దొంగిలిస్తాడు. అతడిపై అప్పటికే 182 కేసులు ఉంటాయి. 4 రాష్ట్రాల పోలీసులు వెతుకుంటారు. ఇక మనోడికి గోల్డ్, అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అలాంటోడు పోలీసులు దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది కథలా అనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే ఈసారి కార్తీ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. టీజర్ చివర్లో.. 'రేయ్ ఎన్ని బాంబులేసిన ఈ జపాన్‌ని ఎవరూ ఏం పీకలేరురా' అని కార్తీ చెప్పిన డైలాగ్ వెరైటీగా ఉంది.

(ఇదీ చదవండి: కార్తీ 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం)

Advertisement
 
Advertisement
Advertisement