ఆ ఘటనతో అమ్మ ఒక్కసారిగా షాక్‌కు గురైంది: జాన్వీ కపూర్  | Janhvi Kapoor Reveals Boney Kapoor rushed from India after an Italian man hit on Sridevi | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: అమ్మపై ఊహించని రీతిలో దాడి జరిగింది: జాన్వీ కపూర్ 

Published Wed, Nov 16 2022 9:34 PM | Last Updated on Thu, Nov 17 2022 5:44 PM

Janhvi Kapoor Reveals Boney Kapoor rushed from India after an Italian man hit on Sridevi  - Sakshi

దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది. ఇటీవలే ఆమె నటించిన చిత్రం 'మిలి' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రానికి ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. 2019 మలయాళంలో హిట్ అయిన హెలెన్‌కి హిందీ రీమేక్‌ మూవీని తెరకెక్కించారు.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇటీవల ఓ చిట్‌ చాట్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్ ఇటలీలో శ్రీదేవికి ఎదురైన ఓ ఘటనను పంచుకున్నారు. గతంలో శ్రీదేవి ఇటలీలో ఫర్నీచర్ షాపింగ్ చేయడానికి వెళ్లినట్లు జాన్వీ కపూర్ వెల్లడించారు.

చెన్నైలోని తమ ఇంటికి ఫర్నీచర్ కోసమని తన ఫ్రైండ్‌తో కలిసి వెళ్లిన సమయంలో ఒక ఇటాలియన్ వ్యక్తి ఆమెకు సైట్‌ కొట్టాడని తెలిపింది. ఈ ఘటనతో మా అమ్మ షాక్‌కు గురైందని పేర్కొంది. ఆ కుర్రాడి ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన శ్రీదేవి ఫ్రైండ్‌ ఈ విషయాన్ని బోనీ కపూర్‌కు ఫోన్‌ చేసి వివరించినట్లు పేర్కొంది. కాగా.. శ్రీదేవి, బోనీ కపూర్ హనీమూన్ ఇటలీలోనే జరిగినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం రాజ్‌కుమార్ రావుతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహితో సహా పలు ఇతర ప్రాజెక్ట్‌ల్లో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement